![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -328 లో..... మైథిలి షటిల్ ఆడి ఓడిపోతుంది. ఏంటి అమ్మ గెలిచే అవకాశం ఉన్నా ఓడిపోయావని వాళ్ళ తాతయ్య అడుగుతాడు. మనం గెలవడం కంటే వేరే వాళ్ళని గెలిపించడంలోనే సంతోషం ఉంటదని మైథిలి చెప్పడంతో పెద్దోళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు వెళ్లి ఫ్రెషప్ అవు.. నీకు సర్ ప్రైజ్ అని మైథిలికి తన గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు. మరొకవైపు సిరి కొడుకు రామ్ ఎనిమిది సంవత్సరాల వాడు అవుతాడు. సీతాకాంత్ ని ఆట పట్డిస్తుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, సందీప్ లని పేరు పెట్టి పిలస్తూ ఒక ఆట ఆడుకుంటాడు.
సీతాకాంత్ ని నాన్న అని పిలుస్తాడు. తన లాగే ఓసీడిలాగా ప్రవర్తిస్తుంటాడు. మరొకవైపు మైథిలి రెడీ అయి కిందకి వస్తుంది. ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందుకే పూజ చేసామంటూ వాళ్ళ నానమ్మ మైథిలీకి చెప్తుంది. మైథిలి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటని మైథిలి తన తాతయ్యని అడుగుతుంది. ఇకనుండి మన ఆఫీస్ మొత్తం నువ్వే చూసుకోవాలని పెద్దాయన చెప్తాడు. " అంత పెద్ద బాధ్యతలు వద్దు తాతయ్య.. నేను ముందు అన్ని నేర్చుకోవాలి. ముందు మీరు మొదలు పెట్టిన స్కూల్ నుండి అన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను" అని మైథిలి అంటుంది. దాంతో వాళ్ళ తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీతాకాంత్, రామ్ ఇద్దరు రెడీ అయి వస్తుంటే.. శ్రీలత వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ రోజు స్కూల్ అన్యూవల్ డే అని రామ్ సూట్ వేసుకుంటాడు. మాకెందుకు చెప్పలేదని శ్రీలత అంటుంది. చెప్పాలనిపించలేదని రామ్ అంటాడు. రామ్, సీతాకాంత్ లు వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే.. మామ అల్లుడులాగా ఉన్నారా.. తండ్రి కొడుకుల్లా ఉన్నారని వాళ్ళు అంటారు. బావగారు వాడి వాళ్లే రామలక్ష్మి అక్కని మర్చిపోయి మళ్ళీ ఇంత సంపాదించగలిగారని శ్రీవల్లి అంటుంది.
రామలక్ష్మి గుర్తురానంత వరకు వాడు హ్యాపీగా ఉంటాడు. మనం హ్యాపీగా ఉంటాం.. రామలక్ష్మిని గుర్తుచేసుకోకుండా మనం చెయ్యాలని శ్రీలత అంటుంది. సీతాకాంత్, రామ్ లు వెళ్తుంటే.. దారిలో ఒక పెద్దావిడ పడిపోతుండటం చూసి.. రామ్ వెళ్లి వాటర్ ఇస్తాడు. అదంతా వెనకాల కార్ లో ఉన్న మైథిలి చూస్తుంది. సీతకాంత్ గుండె వేగంగా కొట్టుకుంటూ.. నాకు దగ్గరగా నాకు కావల్సిన వాళ్ళున్నారు అనిపిస్తుందని అనుకుంటాడు. సీతకాంత్, రామలక్ష్మిలు దగ్గరున్నా ఒకరికొకరు చూసుకోరు. రామ్ కార్ ఎక్కగానే సీతాకాంత్ వెళ్ళిపోతాడు. మరొకవైపు స్కూల్ లో పెద్దాయన వాళ్ళు మైథిలి కోసం చూస్తుంటారు. అప్పుడే మైథిలీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |